OTT Movie: ఆరేళ్ళ తర్వాత ఓటీటీలోకి వచ్చిన మెగాస్టార్ హిట్ మూవీ

by Prasanna |
OTT Movie:  ఆరేళ్ళ తర్వాత ఓటీటీలోకి వచ్చిన మెగాస్టార్ హిట్ మూవీ
X

దిశ, సినిమా : మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018లో ఆయన నటించిన మలయాళ మూవీ ‘అబ్రహామింతే సంతాతికల్’. ఈ మూవీ హిట్ అవ్వదని చాలా మంది అన్నారు. కానీ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రూ.5 కోట్లతో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఎవరు ఊహించని విధంగా ఏకంగా రూ.45 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టిచింది.

క్రైం ఇన్వెస్ట్ గేషన్ తో సాగే ఈ కథ మలయాళ ప్రేక్షకులను విపరీతంగా బాగా ఆకట్టుకుంది. షాజీ పాడూర్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో మమ్ముట్టి సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా పాత్రలో నటించారు. హత్యల కేసును ఎలా పరిష్కారించారన్నదే కథ. ఈ మూవీ ఆరేళ్ల తర్వాత ఓటీటీ లోకి రాబోతుంది.

తెలుగులో ‘డెరిక్ అబ్రహాం’ గా రిలీజ్ అయింది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ లో ఈ సినిమా ఆగస్టు 10 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ‘ఆహా’ ఇప్పటికే దీనికి సంబంధించి ప్రకటన కూడా విడుదల చేసింది. మలయాళంలో పెద్ద హిట్ కొట్టిన ఈ మూవీ ఇప్పుడు మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తుంది.

Advertisement

Next Story