మళ్లీ లీక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఈసారి ఏం చేశాడంటే?

by sudharani |   ( Updated:2023-06-09 12:55:33.0  )
మళ్లీ లీక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఈసారి ఏం చేశాడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా స్టార్ చిరంజీవి హీరోగా, మెహార్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘భోళాశంకర్’. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే.. చిరు నటించిన సినిమాల నుంచి ‘చిరు లీక్స్’ పేరిట లీకులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘భోళాశంకర్’ మూవీ నుంచి షూటింగ్ స్టిల్స్ వదిలిన బాస్.. ఇప్పుడు ఏకంగా ఓ వీడియోనే లీక్ చేశారు.

అయితే.. ఇలా లీక్ చేయబోతున్నట్లు ముందుగానే అనౌన్స్ చేసిన చిరు చెప్పినట్లుగానే ఇన్‌స్టాలో సాంగ్ షూట్‌ను వీడియో రూపంలో లీక్ చేశాడు. అందులో చిరంజీవి, తమన్నా, సుశాంత్, కీర్తి సురేష్‌లతో పాటు ఇతర ఆర్టిస్టులు కూడా కనిపించారు. “జాం జాం జాం జాం జజ్జనక.. తెల్లార్లూ ఆడుదాం తైతక్క” అంటూ సాగే ఈ హుషారైన పాటకు చిరు ఎనర్జటిక్ స్టెప్పులు వేసేందుకు రెడీ అవుతుండడం ఈ వీడియోలో చూడొచ్చు. కాగా.. ‘భోళాశంకర్’ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

ఇవి కూడా చదవండి:

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OG మూవీ అప్‌డేట్

మరీ దారుణం.. చికెన్ కోసం ఎన్టీఆర్ ఇలా చేశారేంటి!

Advertisement

Next Story

Most Viewed