ప్రజల మధ్య ఉండాలంటూ చంద్రబాబు నాయుడుకి బర్త్ డే విషెష్ తెలిపిన మెగాస్టార్ చిరంజీవి.. ట్వీట్ వైరల్

by Disha Web Desk 9 |
ప్రజల మధ్య ఉండాలంటూ చంద్రబాబు నాయుడుకి బర్త్ డే విషెష్ తెలిపిన మెగాస్టార్ చిరంజీవి.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. కాగా సోషల్ మీడియా వేదికన పలువురు ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా చంద్రబాబు నాయుడికి బర్త్ డే విషెష్ తెలిపారు. ‘‘అహర్నిశం ప్రజల మధ్య ఉంటూ,ప్రజా సంక్షేమం కోసం పాటుపడే శ్రీ నారా చంద్రబాబునాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’’. అంటూ చిరంజీవి ట్విట్టర్ వేదికన రాసుకొచ్చారు.



Next Story