‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫస్ట్ రివ్వూ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ట్వీట్ వైరల్

by sudharani |   ( Updated:2023-09-06 06:04:05.0  )
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫస్ట్ రివ్వూ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి. మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే.. మూవీ ఫస్ట్ రివ్వూ ఇచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి.

ఈ మేరకు ‘మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి’ చూశాను.. మొదటి నుంచి చివరి వరకు ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్‌గా ఉన్న మనందరి ‘దేవసేన’ అనూష్క శెట్టిలు ఈ చిత్రానికి ప్రాణం పోశారు.

ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్‌ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ Mahesh Babu ని అభినందించాల్సిందే. BTW ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడిని నేనే.. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్‌లో ప్రేక్షకులందరి తోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి 100% ఆడియన్స్‌ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు!!!’ అంటూ ట్వీట్ చేశారు. కాగా.. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story