oscars 2023-Naatu Naatu: వందకోట్ల హృదయాలను గర్వపడేలా చేసింది: చిరంజీవి

by GSrikanth |   ( Updated:2023-03-13 12:58:52.0  )
oscars 2023-Naatu Naatu: వందకోట్ల హృదయాలను గర్వపడేలా చేసింది: చిరంజీవి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై టాలీవుడ్ దిగ్గజ నటులు, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నాటు నాటు పాట ప్రపంచ శిఖరాగ్రాన నిలిచిందని అన్నారు. రాజమౌళి ధైర్యం, దార్శనికతతో ఈ అద్భుతం సాకారమైందని పేర్కొన్నారు. అంతేగాక, ఆర్ఆర్ఆర్ చిత్రం వందకోట్ల భారతీయుల హృదయాలను గర్వపడేలా చేసిందని అభిప్రాయపడ్డారు. కాగా, 95వ అకాడమీ అవార్డ్‌లో నాటు నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరిలో అవార్డ్ గెలుచుకుంది. అంతర్జాతీయ వేదికపై ఆస్కార్ అవార్డ్ అందుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పాట పాడారు.

ఇవి కూడా చదవండి : ఆస్కార్ అవార్డ్ అందుకుంటున్న వేళ కీరవాణి ఎమోషనల్

Advertisement

Next Story