- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేరళ సీఎంను కలిసిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రధాని నరేంద్ర మోడీకి కీలక రిక్వెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఇటీవల వయనాడ్ బాధితులకు ప్రకటిచిన రూ. కోటి విరాళాన్ని స్వయంగా సీఎం విజయన్‌కు అందించారు. అనంతరం అక్కడ మీడియాతో చిరంజీవి మాట్లాడారు. వయనాడ్ బాధితులకు సాయం చేసేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతేగాకుండా ఈ వదరలను జాతీయ విపత్తుగా గుర్తించాలని కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా కోరారు. కాగా, వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 360 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. విపత్తు బాధితులకు అండగా నిలబడేందుకు సినీ పరిశ్రమలోని పలువురు స్టార్స్ విరాళాలు ఇస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ రూ.2 కోట్లు, అల్లు అర్జున్ రూ.25 లక్షలు, నయనతార రూ.20 లక్షలు, హీరో విక్రమ్రూ.20 లక్షలు, హీరో సూర్య, కార్తీ సంయుక్తంగా రూ.50 లక్షలు, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ కలిసి రూ.35 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు ఇచ్చారు. హీరోయిన్ రష్మిక రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు.