బలిసి కొట్టుకుంటున్నారా?.. మెగాస్టార్ సెన్సేషనల్ ట్వీట్

by GSrikanth |   ( Updated:2022-10-11 16:17:56.0  )
బలిసి కొట్టుకుంటున్నారా?.. మెగాస్టార్ సెన్సేషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో మెగాస్టార్ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. గాడ్ ఫాదర్ మూవీలో చిరు చెప్పిన డైలాగ్స్‌ను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అంతేగాక, పవర్ ఫుల్ డైలాగ్స్ అందించావంటూ రైటర్ లక్ష్మీభూపాల్‌ను అభినందించారు చిరు. ''ఇన్నాళ్లూ రోడ్డు కాంట్రాక్టులు, ఇసుక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, నీళ్ల కాంట్రాక్టులు, మందు కాంట్రాక్టులు అంటూ ప్రజల సొమ్ము అడ్డంగా తిని బలిసి కొట్టుకుంటున్నారు. ఒక్కొక్కళ్లూ.. ఇకనుంచి మీరు పీల్చే గాలి కాంట్రాక్టు నేను తీసుకుంటున్నా.. ఇందులో ఒకటే రూల్.. ఇకనుంచి ప్రజలకు సుపరిపాలన అందించాలనే నిర్ణయం, తప్పు చేయాలంటే భయం మాత్రమే మీ మనసుల్లో ఉండాలి. లేదంటే.. మీ ఊపిరి గాల్లో కలిసిపోతుంది.'' అంటూ ఉన్న 'గాడ్ ఫాదర్' మూవీ డైలాగ్స్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ప్రస్తుతం దీనిని రీట్వీట్ చేస్తున్న మెగా అభిమానులు నెట్టింట్లో రచ్చ చేస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి :

నెట్టింట నగ్నంగా దర్శనమిచ్చిన స్టార్ నటి.. ఆ డబ్బు కోసమేనంటూ

మొదటిసారి బాలకృష్ణపై కేసు పెట్టిన హిజ్రాలు.. కారణం ఇదే?



Advertisement

Next Story