మెగాస్టార్ చిరంజీవికి అమెరికాలో ఘన సన్మానం.. ఆకట్టుకుంటోన్న చిరు స్పీచ్

by Anjali |   ( Updated:2024-02-20 13:35:30.0  )
మెగాస్టార్ చిరంజీవికి అమెరికాలో ఘన సన్మానం.. ఆకట్టుకుంటోన్న చిరు స్పీచ్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇండస్ట్రీలో మెగాస్టార్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇకపోతే రీసెంట్ గా మెగాస్టార్ ఫ్రెండ్ కుమారుడి పెళ్లి కోసం అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న చిరంజీవి ఫ్యాన్స్ చిరుకు ఘనంగా సన్మానం చేశారు. పద్మభూషణ్ వరించిన సందర్భంగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిరు స్టేజీపై మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికన మెగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అందుకున్నప్పటికి చివరిసారిగా నటించిన ‘భోళా శంకర్ సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. నెక్ట్స్ ‘విశ్వంభర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Advertisement

Next Story