‘సలార్’ రివ్యూ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్

by Hamsa |   ( Updated:2024-01-04 14:23:59.0  )
‘సలార్’ రివ్యూ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటించిన మొదటి చిత్రం ‘సలార్’. దీనిని స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 22న విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అన్ని ప్రాంతాల ప్రజలు సలార్ జపం చేస్తున్నారు. అంతేకాకుండా చూసిన వారే మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్తూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలువురు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

తాజాగా, మెగాస్టార్ చిరంజీవి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘బాక్సాఫీస్ ని తగలబెట్టేస్తున్నందుకు మై డియర్ దేవా రెబల్ స్టార్ ప్రభాస్ కి కంగ్రాట్స్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి నా అభినందనలు. సరికొత్త ప్రపంచాన్ని సృష్టించడం లో మీకు మీరే సాటి. వరదరాజ మన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఆద్యగా శృతి హాసన్, కార్త పాత్రలో జగపతి బాబు అద్భుతంగా నటించారు. అలాగే హోంబాలే సంస్థకు, చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ అంటూ చిరంజీవి ట్వీట్‌లో రాసుకొచ్చారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read More..

‘సలార్’ నటీనటుల రెమ్యునరేషన్లు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Advertisement

Next Story