Tollywood: ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్, బాలయ్య, వెంకటేష్..!

by Prasanna |
Tollywood: ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్, బాలయ్య, వెంకటేష్..!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగు సినీ ఇండస్ట్రీ స్వర్ణోత్సవ వేడుకలు ఆదివారం హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించారు.

బాలయ్య కుటుంబంతో పాటు సినీ, రాజకీయ వేత్తలు కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో చిరంజీవి, వెంకటేష్, కమల్ హాసన్, రజినీకాంత్, మోహన్ బాబు హైలెట్ గా నిలిచారు. సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఈ ప్రోగ్రాం లో సందడి చేశారు. అయితే, ఈ సందర్భంగా మెగాస్టార్, బాలయ్య, వెంకటేష్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

చిరంజీవి మాట్లాడుతూ బాలయ్యని ఆయన పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసారు. ఇంద్ర మూవీ తీయడానికి బాలకృష్ణ సినిమానే ఆదర్శమని చిరంజీవి అన్నారు. ఈ వేడుకకు నేను అటెండ్ అవ్వడం చాలా ఉందని అన్నారు. బాలకృష్ణతో కలిసి ఒక ఫాక్షన్ సినిమా చేయాలని ఉందంటూ ఆయన మనసులోని కోరిక చెప్పాడు. ప్రస్తుతం, ఈ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story