సురేఖ అతని భార్య కావాల్సింది.. కానీ ఆ నటుడి సలహాతో చిరంజీవికి కట్టబెట్టారు

by Sujitha Rachapalli |
సురేఖ అతని భార్య కావాల్సింది.. కానీ ఆ నటుడి సలహాతో చిరంజీవికి కట్టబెట్టారు
X

దిశ, సినిమా :మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులను చూస్తుంటే ముచ్చటేస్తుంది కదా. ఇన్నాళ్లు సంసారం సాఫీగా సాగిందంటే ఇద్దరి అన్యోన్యత ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే నిజానికి సురేఖకు ఆమె తండ్రి అల్లు రామలింగయ్య ముందుగా కలెక్టర్ సంబంధం తీసుకొచ్చాడట. ఆ తర్వాత అప్పుడే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవిని చూసి.. ఇతనికి తన బిడ్డను ఇస్తే బాగుంటుంది కదా అనుకున్నాడట. వెంటనే ఈ విషయాన్ని చిరు దగ్గర ప్రస్తావిస్తే.. మరో మాట మాట్లాడకుండా ఓకే చెప్పేశాడట. కానీ అప్పటికే సెటిల్ అయిన కలెక్టర్‌కు ఇవ్వాలా? ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చిరుకు బిడ్డను కన్యాదానం చేయాలా? అనే సందేహంతో సతమతం అయ్యాడట అల్లు రామలింగయ్య.

అయితే సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి.. అల్లు రామలింగయ్యకు మంచి స్నేహితుడు కావడంతో ఎవరికిస్తే బాగుంటుందని సలహా అడిగాడట. ఇదంతా కాదు ముందు సురేఖ అభిప్రాయాన్ని తీసుకుని.. ఆమెకు ఎవరు నచ్చారని చెప్తే వారితోనే పెళ్లి చేయమని సజెస్ట్ చేశాడట. దీంతో సురేఖ మెచ్చిన చిరుతో 1980 ఫిబ్రవరి 20న ప్రముఖుల సమక్షంలో వివాహం జరిగింది.

ఆ తర్వాత చిరు తన మామ బ్యానర్‌ గీతా ఆర్ట్స్‌ ఎదిగేందుకు చాలా సహాయపడ్డాడు. అదే ప్రొడక్షన్ హౌజ్‌లో నంబర్ ఆఫ్ మూవీస్ చేసిన ఆయన సినిమాలు భారీ కలెక్షన్స్ రాబట్టడంతోపాటు చిరంజీవి మెగాస్టార్‌గా ఎదిగేందుకు హెల్ప్ అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed