Matka update : అదిరిపోయే పోస్టర్‌తో మట్కా మూవీపై అంచనాలను పెంచేసిన మేకర్స్

by Hamsa |   ( Updated:2024-07-18 11:07:56.0  )
Matka update : అదిరిపోయే పోస్టర్‌తో మట్కా మూవీపై అంచనాలను పెంచేసిన మేకర్స్
X

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మట్కా’. ఈ సినిమా కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇందులో నోరా ఫతేహి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మట్కా మూవీ మేకర్స్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చి అంచనాలను పెంచేశారు. ఈ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

చాలా కీలకమైన సన్నివేశాలు, హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్, రెట్రో థీమ్ సాంగ్స్ షూటింగ్ జరిగినట్లు వెల్లడించారు. అలాగే ట్విట్టర్ వేదికగా నోరా ఫతేహీ రెట్రో అవతార్‌లో ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో కలర్‌ఫుల్ పబ్‌సెట్‌లో ఎలిగెంట్ పోజులో కనిపించింది. అయితే జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ అదిరిపోయే సెట్‌లో నెంబర్ అఫ్ డ్యాన్సర్‌‌తో చాలా గ్రాండ్‌గా షూట్ చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ వైజాగ్‌లో శరవేగంగా జరుగుతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed