Chiranjeevi: మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ.. చిరంజీవి ‘విశ్వంభర’ టీజర్‌‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్!

by Hamsa |   ( Updated:2024-09-13 06:56:23.0  )
Chiranjeevi: మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ.. చిరంజీవి ‘విశ్వంభర’ టీజర్‌‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై విక్రమ్, ప్రమోద్, వంశీ నిర్మిస్తున్నారు. ఇందులో దైవ కార్యం నెరవేర్చడానికి భూమిపైకి వచ్చిన కారణజన్ముడికి, విశ్వంభర అనే లోకానికి మధ్య ఉండే సంబంధాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

విజువల్ ఎఫెక్ట్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే విశ్వంభర నుంచి విడుదలైన పోస్టర్స్ భారీ అంచనాలను పెంచేశాయి. దీంతో మెగా అభిమానులు ఈ మూవీ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో.. ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మెగా ఫ్యాన్స్ ఆనందానికి కారణమవుతోంది. తాజాగా, అందుతున్న సమాచారం మేరకు.. విశ్వంభర టీజర్ దసరా కానుకగా అక్టోబర్ 12న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది 2025 జనవరిలో థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

Advertisement

Next Story