నిహారిక మాజీ భర్త చైతన్యకు పెళ్లి కార్డు ఇచ్చిన మెగా ఫ్యామిలీ.. ఆమె ఏం చేసిందో తెలుసా.. ?

by Anjali |   ( Updated:2023-10-16 09:20:00.0  )
నిహారిక మాజీ భర్త చైతన్యకు పెళ్లి కార్డు ఇచ్చిన మెగా ఫ్యామిలీ.. ఆమె ఏం చేసిందో తెలుసా.. ?
X

దిశ, సినిమా: మెగా ఫ్యామిలీ ఇంట్లో త్వరలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి బాజాలు మోగనున్న విషయం తెలిసిందే. రహస్యంగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇక పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేయగా తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీకి కూడా వరుణ్, లావణ్య పెళ్లి కార్డు వెళ్ళిందట. దీంతో నిహారిక కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాదు అతను వస్తే పెళ్లికి కూడా రానని చెప్పిందట. దీంతో చిరంజీవి 'నువ్వు కోడలుగా వెళ్లే కంటే ముందే వాళ్లు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్. అలాంటప్పుడు అందరికీ ఇచ్చినట్లే వాళ్లకు కూడా కార్డు ఇచ్చాం. ఇలా జరిగిందని మనం వారిని కించపరచకూడదు.అందరిని ఒకేలా ట్రీట్ చేయాలి. మనల్ని తిట్టే వాళ్లని మనం ప్రేమగా హత్తుకోవాలి’ అంటూ నిహారికకు నచ్చాజెప్పాడట చిరంజీవి. ఇక పెదనాన్న మాటలతో నిహారిక కూడా కన్విన్స్ అయిందట. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలిదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement

Next Story