- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోజాపై మీనా షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: అలనాటి హీరోయిన్లలో మీనా కూడా ఒకరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అన్ని భాషల్లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బాల నటిగా కెరీర్‌ను మొదలు పెట్టి.. స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ తర్వాత వివాహం చేసుకుని.. కుమార్తెకు జన్మనిచ్చింది. కొద్ది కాలం గ్యాప్ తర్వాత ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా.. తన తోటి నటి అయిన రోజా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
‘అప్పట్లో హీరోయిన్ పాత్రలకు చాలా డిమాండ్ ఉండేది. రచయితలు కూడా ప్రత్యేకంగా హీరోయిన్లను దృష్టిలో పెట్టుకుని పాత్రలు రాసేవారు. అది నిజంగా ఒక అదృష్టం. అప్పట్లో కూడా గ్లామర్ షో చేయడానికి చాలా మంది హీరోయిన్స్ ఆసక్తిగా ఉండేవారు. నాకు కూడా అలాంటి సినిమాలలో నటించాలని ఉండేది. కానీ పరిమితి దాటి గ్లామర్ షో చేయలేదు. ఇక నేను హీరోయిన్గా చేస్తున్న టైమ్‌లో రమ్యకృష్ణ, రంభ, రోజా మంచి ప్రెండ్స్ అయ్యాం. వారితో స్నేహం చేయడం నా అదృష్టం. ఇక ఎంతమంది స్టార్ హీరోయిన్స్‌గా కొనసాగుతున్నా ఎవరితో పోటీ లేదు. కానీ రోజాతో మాత్రం నాకు పోటీ ఉండేది. ఇద్దరం బిజీగా ఉండే వాళ్లాం. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల కమిట్ అయిన చిత్రాలను ఎక్స్చేంజ్ చేసుకుని నటించాం’ అని తెలిపింది మీనా.