- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ డైరెక్టర్‌తో ఎఫైర్ పెట్టుకుంటే సినిమా హిట్టే: Meenakshi Seshadri
దిశ, సినిమా: ప్రముఖ బాలీవుడ్ నటి మీనాక్షి శేషాద్రి దర్శకుడు రాజ్ కుమార్ సంతోషితో ఎఫైర్ గురించి ఓపెన్ అయింది. అంతేకాదు కొంతకాలంగా ఫ్యామిలీతో యూఎస్‌లో ఉంటున్న ఆమె మళ్లీ బాలీవుడ్ సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. గత అనుభవం ఆధారంగా ఎలాంటి పాత్రనైనా చేయగలననే నమ్మకంతో ముందుడుగు వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. అలాగే సంతోషి దర్శకత్వంలో చేసిన 'దామిని' సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కావడంతో.. తమ మధ్య ఏదో జరుగుతుందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలొచ్చాయని గుర్తుచేసింది. అయితే ఆ చిత్రాన్ని ఎలాగైనా ఉత్తమ చిత్రంగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో అత్యంత గౌరవప్రదమైన పద్ధతిలోనే పనిచేశామన్న ఆమె.. కొంతమంది తమ విజయాన్ని చూడలేక ఇల్లీగల్ రిలేషన్‌షిప్ రూమర్స్ క్రియేట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమా తర్వాత వెంటనే తాను మరొకరిని వివాహం చేసుకోగా.. సంతోషి కూడా పెళ్లి చేసుకుని సెటిల్ కావడంతో పుకార్లకు చెక్ పడిందని తెలిపింది.
ఇవి కూడా చదవండి : వివాదంలో సింగర్ మంగ్లీ.. సోషల్ మీడియాలో ట్రోల్స్