శ్రీ లీలకు షాక్ ఇచ్చిన మీనాక్షి చౌదరి?

by Nagaya |   ( Updated:2023-09-06 11:32:27.0  )
శ్రీ లీలకు షాక్ ఇచ్చిన మీనాక్షి చౌదరి?
X

దిశ, సినిమా: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. అయితే ఈ మూవీలో ముందుగా పూజా హెగ్దేను మెయిన్ హీరోయిన్‌గా రెండవ కథానాయికగా శ్రీ లీలను ఎంపిక చేశారు. అయితే తర్వాత పూజా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో శ్రీ లీలను మెయిన్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని సెకండ్ హీరోయిన్‌గా ఓకే చేశారు. తాజా సమాచారం ప్రకారం దర్శకనిర్మాతలు అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మీనాక్షి చౌదరిని పూజాహెగ్డే పాత్ర కోసం ఫైనల్ చేశారని, రెండో కథానాయికగా శ్రీలీలను పెట్టినట్లు సమాచారం. ఇక దాదాపు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ముందుగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తీయాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల టాలీవుడ్‌కే పరిమితమైంది.

More News about Meenakshi Chaudhary

More News about Actress Sree Leela

Advertisement

Next Story