Meenakshi Chaudhary: చాలా భయంగా ఉంది.. ఆ సినిమాలపై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

by sudharani |
Meenakshi Chaudhary: చాలా భయంగా ఉంది.. ఆ సినిమాలపై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే మంచి స్టార్‌ఢమ్‌ను సొంతం చేసుకుంది. ‘ఇచట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. మహేశ్ బాబు ‘గుంటూరు కారం’తో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో ప్రజెంట్ వరుస మూవీస్ చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ‘లక్కీ బాస్కర్’, ‘గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)’, ‘విశ్వంభర’, మెకానిక్ రాకీ, మట్కా వంటి సినిమాలతో బిజీగా ఉంది. ఇందులో సెప్టెంబర్ 5న ‘గోట్’, సెప్టెంబర్ 7న ‘లక్కీ భాస్కర్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో వీటిపై ఎన్నో హోప్స్ పెట్టుకుంది మీనాక్షి.

వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న మీనాక్షి చౌదని తనకు చాలా భయంగా ఉందంటూ తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘ప్రజెంట్ వరుసగా పాన్ ఇండియా చేస్తుంటే ఓ వైపు ఆనందంగా ఉన్నప్పటికీ మరోవైపు చాలా భయంగా కూడా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ ఏడాది ‘గుంటూరు కారం’తో మంచి హిట్ అందుకున్న హీరోయిన్‌కు ఈ మూవీస్ ఎలాంటి స్టార్‌ఢమ్‌ను తెచ్చిపెడతాయో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Next Story