- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్ మహారాజా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ ట్విట్టర్ రివ్యూ
దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహా రాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ ఇది. దీనిని డైరెక్టర్ వంశీకృష్ణ తెరకెక్కించారు. ఇందులో నూపుర్ సనన్, భరద్వాజ్ హీరోయిన్స్‌గా నటించగా..రేణు దేశాయ్ కీలక పాత్రల్లో నటించింది. భారీ అంచనాల మధ్య నేడు అక్టోబర్ 20న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలైంది. అయితే ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమాను చూసిన వారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. డార్క్ క్యారెక్టర్‌లో రవితేజ యాక్షన్ హైలెట్ అని అంటున్నారు. ఈ మధ్య రవితేజ నటించిన మూవీస్‌లో ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే రన్ టైమ్ ఎక్కువగా ఉండడం వల్ల కొంత సాగదీసినట్లుగా అనిపించిందని అంటున్నారు. మొత్తానికి ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.