నాకు అలాంటి పాత్రలో నటించాలని ఉంది: ఎన్‌టీ‌ఆర్

by sudharani |   ( Updated:2023-01-13 09:14:20.0  )
నాకు అలాంటి పాత్రలో నటించాలని ఉంది: ఎన్‌టీ‌ఆర్
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరో ఎన్‌టీఆర్ హాలీవుడ్ మూవీ అవకాశాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో తను నటించిన 'నాటు నాటు' సాంగ్ బెస్ట్ ఒరిజినల్ అవార్డ్ అందుకుంది. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడుతూ.. 'హాలీవుడ్‌లో చాన్స్ వస్తే తప్పకుండా స్వీకరిస్తా. అయితే మొదటి చాన్స్ 'మార్వెల్' సిరీస్‌లోనే రావాలని కోరుకుంటా. ఎందుకంటే నాకు ఐరన్ మాన్ అంటే చాలా ఇష్టం. అలాంటి క్యారెక్టర్ నాకు చాలా దగ్గరగా అనిపిస్తుంది. అందుకే 'మార్వెల్' చేయాలని ఎప్పటినుంచో కోరిక. నా అభిమానులు నా నుంచి ఈ క్యారెక్టర్ కోరుకుంటున్నట్లు చాలాసార్లు చెప్పారు. టైమ్ బాగుంటే త్వరలోనే పిలుపు రావొచ్చేమో' అంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు.

Read more:

అందుకే కండోమ్ ఫ్యాక్టరీలో హెడ్ పాత్రను ఎంచుకున్నా- రకుల్

Advertisement

Next Story