నాకు పెళ్లి అయింది.. దూరం జరుగు అంటున్న Rakhi Sawant

by Prasanna |   ( Updated:2023-02-04 14:40:34.0  )
నాకు పెళ్లి అయింది.. దూరం జరుగు అంటున్న Rakhi Sawant
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన చేష్టలతో, మాటలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే గతేడాది ఫిబ్రవరిలో వాలంటైన్స్‌ డే రోజున ఆమె తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేసింది. అయితే ఏడాది తిరక్కముందే అదిల్‌ ఖాన్‌ను రెండో వివాహమాడి మళ్లీ పెద్ద షాక్ ఇచ్చింది. ఇక రీసెంట్‌గా రాఖీ తన అభిమానిపై ఫైర్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ముంబైలో రాఖీ సావంత్‌ కనపడగానే ఓ అభిమాని పరిగెత్తుకెళ్లి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. దాంతో అతడ్ని వారించిన రాఖీ సావంత్‌.. 'ఓ అయ్యా! నాకు పెళ్లి అయింది. కాస్త దూరం జరుగు. పెండ్లి కాక ముందంటే అది వేరు' అంటూ అతడికి దూరంగా జరిగింది.

Advertisement

Next Story