- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరంజీవి తన తమ్ముడికి విరాళం ఇవ్వడం వెనుక భారీ స్కెచ్.. మెగా అభిమానుల్లో క్లారిటీ వచ్చినట్లేనా !
దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ టైమ్ జనసేన పార్టీకి భారీ విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ. 5 కోట్ల డొనేషన్‌కు సంబంధించిన చెక్కును తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు స్వయంగా అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి. దీంతో ఇటు మెగాస్టార్ అభిమానులు, అటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతుండగా, మరోవైపు పొలిటికల్ యాంగిల్‌లో కూడా డిస్కషన్ నడుస్తోంది.
మెగాస్టార్, పవర్ స్టార్‌కు అంత మొత్తంలో విరాళం ఇవ్వడం వెనుక భారీ పొలిటికల్ స్కెచ్ ఏదో ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా అందులో తప్పేముంది? డొనేషన్ ఇవ్వడం ద్వారా మెగాస్టార్ ఇచ్చిన క్లారిటీ కూడా అదే కదా అంటున్నారు మెగా బ్రదర్స్ అభిమానులు. తాజా పరిణామాలు కూడా అందుకు అద్దం పడుతున్నాయి. రూ.5 కోట్ల విరాళం ఇవ్వడంతో చిరంజీవి తన సపోర్ట్ జనసేనకేనని స్పష్టత కూడా ఇచ్చినట్లు అయింది. అయితే సరిగ్గా ఎలక్షన్ టైమ్‌లో ఈ పరిణామాలు రకరకాల చర్చలకు దారితీస్తున్నాయి.
మెగా అభిమానుల్లో చాలా రోజులుగా వర్గ విభేదాలు ఉన్నాయనే ప్రచారం కూడా ఉంది. చిరంజీవి ఫ్యాన్స్ ఏమో పవన్‌ను వ్యతిరేకిస్తుంటారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులేమో చిరంజీవిని వ్యతిరేకిస్తుంటారు. పలు సందర్భాల్లో ఓపెన్‌గానే విమర్శలు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. చిరంజీవి చిత్ర పరిశ్రమ అభివృద్ధి పేరుతో ఏపీ సీఎం జగన్‌తో సన్నిహితంగా మెలిగడమే ఇందుకు కారణంగా చెప్తుంటారు. దీంతో పవన్ అభిమానులు మెగాస్టార్ జనసేనకు సపోర్టుగా లేరనే కోపంతో ఉండేవారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారిపోయింది. రీసెంట్‌గా చిరంజీవి రూ. 5 కోట్ల విరాళం తన తమ్ముడికి ఇవ్వడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా తన ఫుల్ సపోర్ట్ పవన్‌కే ఉంటుందనే సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో మెగా అభిమానులంతా ఒక్కటవుతున్నారు. కాగా ఇదంతా భారీ స్కెచ్, పొలిటికల్ గేమ్ అనే చర్చ కూడా నడుస్తోంది.