చేతిలో మామిడి పండ్లు.. త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్ చేస్తానంటున్న కియారా పోస్ట్ వైరల్..!

by Hamsa |   ( Updated:2023-03-04 09:22:54.0  )
చేతిలో మామిడి పండ్లు.. త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్ చేస్తానంటున్న కియారా పోస్ట్ వైరల్..!
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి ఫిబ్రవరి 7న ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సినిమాలకు ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా పెళ్లి అయిన కొన్ని రోజులకే వర్క్ స్టార్ చేసింది. మరోవైపు సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా, కియారా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టింది. చేతిలో మామిడి పండ్ల ప్లేట్ పట్టుకుని చైర్‌లో కూర్చున్న ఫొటోను షేర్ చేస్తూ ‘‘ రెడీగా ఉండండి త్వరలో బిగ్ అనౌన్స్ మెంట్ చేస్తాను’’ అంటూ క్యాప్షన్ పెట్టింది.

ఆ తర్వాత దానిని డిలీట్ చేసి ఎల్లో కలర్ డ్రెస్‌ ధరించి చేతిలో మామిడి పండ్లను పట్టుకుని ఉన్న ఫొటోలను పెట్టింది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. పెళ్లైంది.. మామిడి పండ్లు పట్టింది.. అప్పుడే మామిడి తింటున్నారా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కానీ, అది స్లైస్ కూల్ డ్రింక్ యాడ్ కోసం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కియారా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి : Nawazuddin Siddiqui: భార్య, పిల్లలను బయటకు గెంటేసిన నటుడు.. రోడ్డుపై రోదిస్తున్న కూతురు



Advertisement

Next Story

Most Viewed