ప్రమాద ఘటనపై మంగ్లీ షాకింగ్ కామెంట్స్..

by Anjali |   ( Updated:2023-06-26 12:25:36.0  )
ప్రమాద ఘటనపై మంగ్లీ షాకింగ్ కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ ప్రమాదానికి గురయ్యారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. బోనాలపై ఓ ప్రైవేట్ పాట షూట్ చేస్తున్న సమయంలో ఆమె జారీ పడడంతో కాలికి గాయమయ్యిందని, వైద్యులు కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనిపై మంగ్లీ తాజాగా స్పందించి.. ‘ నేను ప్రమాదానికి గురయ్యానంటూ వస్తున్న వార్తలు నిజం కాదు. అవి పూర్తిగా అవాస్తవాలు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. షూటింగ్ కూడా అద్భుతంగా పూర్తి చేశామని’’ తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోలో చెప్పుకొచ్చారు. మంగ్లీ ఇది ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read

సింగర్‌తో సీక్రెట్ ఎఫైర్ పెట్టుకున్న Khushi Kapoor.. ఒంటరిగా ఉండలేకపోతుందట

Advertisement

Next Story