మార్చి 3న భూమా మౌనికతో మంచు మనోజ్ పెళ్లి.. అన్ని ఏర్పాట్లు పూర్తి?

by Hamsa |   ( Updated:2023-02-25 06:44:20.0  )
మార్చి 3న భూమా మౌనికతో మంచు మనోజ్ పెళ్లి.. అన్ని ఏర్పాట్లు పూర్తి?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడి మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. దొంగ దొంగది సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఝుమ్మంది నాదం, కరెంట్ తీగ, బిందాస్, రాజుభాయ్ వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు.

అయితే గత కొద్ది కాలంగా భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికను మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ మనోజ్ ఇప్పటి వరకు ఈ విషయంపై ఎక్కడ స్పందించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిల పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టు వార్తలు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వీరు మార్చి 3న పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారట.. అంతేకాకుండా వివాహానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వివాహానికి సంబంధించిన ఫంక్షన్ మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న ఇంట్లో జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వార్త హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story