గుడ్‌న్యూస్.. అంటూ కవల పిల్లల గురించి బయటపెట్టిన మంచు మనోజ్?

by Anjali |
గుడ్‌న్యూస్.. అంటూ కవల పిల్లల గురించి బయటపెట్టిన మంచు మనోజ్?
X

దిశ, సినిమా: గతేడాది మంచు మనోజ్ అండ్ మౌనికా రెడ్డి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరు కవలలకు జన్మనిచ్చారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మనోజ్ ఈ వార్తలపై స్పందించి.. ‘‘నా అభిమాన కుటుంబానికీ గుడ్ న్యూస్.. నా భార్య ప్రస్తుతం 7 వ నెల. చాలా ఆరోగ్యంగా ఉంది. కొద్ది రోజుల్లోనే మా లైఫ్ లోకి రాబోతున్న నా బిడ్డ కోసం ఎంతో సంతోషంగా ఎదురుచూస్తున్నాం.

కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు ఏ మాత్రం నిజం కాదు. మాకు కవలలు పుట్టారంటున్నారు. ఆ సందర్భం వస్తే మేమే మీకు చెబుతాం. దయచేసి అలాంటి పుకార్లను నమ్మొద్దు’’ అంటూ మంచు మనోజ్ జనాలందరికీ క్లారిటీ ఇచ్చాడు. ఇక భూమా మౌనికకు ఇప్పటికే ఓ వివాహం అయిన విషయం తెలిసిందే. మౌనిక - మనోజ్ మంచి ఫ్రెండ్స్. ఒకరినొకరు అర్థం చేసుకుని.. జీవితాంతం హ్యాపీగా ఉండగలమని నిర్ణయించుకుని వీరిద్దరు పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed