మంచు మనోజ్‌కు మళ్లీ పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా?

by Hamsa |   ( Updated:2022-09-05 05:52:12.0  )
మంచు మనోజ్‌కు మళ్లీ పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు తనయుడు హీరో మంచు మనోజ్ 'దొంగ దొంగది' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ బాక్సాఫీసు వద్ద అంతగా ఆడలేదు. 2015లో హైదరాబాద్‌కు చెందిన ప్రణతీ రెడ్డిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి సినిమాల్లో కూడా నటించడం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మాజీ ఎంపీ దివంగత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనిక రెడ్డిని వివాహం చేసుకోబోతునట్లు తెలుస్తోంది.

దీనికి కారణం వారిద్దరు హైదరాబాద్‌లోని ఓ వినాయకుని మండపం వద్ద ఉన్న ఫొటోలు బయట పడటంతో, ఇలాంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరు కలిసి గణేష్‌ను దర్షించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు.'' వివాహం గురించి ప్రశ్నించగా.. అది పర్సనల్ విషయమని.. ఓ మంచి రోజు చూసుకుని తానే అందరికీ చెబుతానని అన్నాడు. అదేవిధంగా సినిమాలు, రాజకీయాల్లోకి వచ్చే విషయంపై అడగ్గా.. వాటి గురించి కూడా త్వరలో మాట్లాడుతానని.. ప్రస్తుతం వినాయకుడి గురించి మాట్లాడుకుందామంటూ మంచు మనోజ్ సమాధానం ఇచ్చాడు''. మంచు మనోజ్‌కు, భూమా మౌనిక రెడ్డికి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. ఈ విషయంపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read : సినిమాల్లో అదరగొట్టిన వీళ్లు కూడా ముందు టీచర్లే!



Advertisement

Next Story