కొడుకును వదిలిపెట్టి అక్కడ ఏకాంతంగా గడపుతోన్న మనోజ్-మౌనికరెడ్డి.. తిట్టిపోస్తున్న జనాలు

by Anjali |
కొడుకును వదిలిపెట్టి అక్కడ ఏకాంతంగా గడపుతోన్న మనోజ్-మౌనికరెడ్డి.. తిట్టిపోస్తున్న జనాలు
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ గత ఏడాది భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి ఫిల్మ్ నగర్‌లో ఉన్నటువంటి మంచు లక్ష్మీ ప్రసన్న నివాసంలో ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. మౌనికకు ఇప్పటికే వేరే వ్యక్తితో వివాహమైంది.. ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

ఆ బాలుడు ప్రస్తుతం మౌనిక రెడ్డితోనే మంచు మనోజ్ వాళ్ల ఇంట్లో ఉంటున్నాడు. మనోజ్ కూడా ఆ అబ్బాయిని సొంత కుమారుడిలాగే చూసుకుంటున్నాడు. పెళ్లైనప్పటి నుంచి మనోజ్-మౌనిక రెడ్డి కలిసిమెలసి ఉంటూ అన్యోన్య దంపతులుగా రాణిస్తున్నారు. ఫేస్టివల్స్, పార్టీలు, వెకేషన్స్‌.. ఇలా ఏ కార్యక్రమానికైనా ఇద్దరు కలిసే హాజరవుతున్నారు. అయితే నిన్న (ఫిబ్రవరి 14) వాలెంటైన్స్ డే సందర్భంగా వీరిద్దరు ఏకాంతంగా గడపడం కోసం విదేశాలకు వెళ్లారు. సముద్రపు ఒడ్డున నవ్వుతూ.. ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.

మంచు మనోజ్ పంచుకున్న ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. బెస్ట్ కపుల్‌, పెళ్లైన అమ్మాయిని వివాహం చేసుకుని, తన కుమారుడ్ని కూడా ఇంట్లో ఉంచుకున్న మనోజ్‌ది గ్రేట్ హార్ట్ అంటూ కొంతమంది కామెంట్లు పెట్టగా.. మరికొంతమంది.. కొడుకుని ఎక్కడో వదిలిపెట్టి విదేశాల్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నావంటూ భూమా మౌనికపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Advertisement

Next Story

Most Viewed