గొప్ప మనసు చాటుకున్న మంచు లక్ష్మి.. ఏకంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను..

by Kavitha |
గొప్ప మనసు చాటుకున్న మంచు లక్ష్మి.. ఏకంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను..
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి అందరికీ సుపరిచితమే. పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. ఇటీవల ‘యక్షిణి’ అనే హారర్ వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించింది. ఈమె కేవలం సినిమాలే కాకుండా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా పేద విద్యార్థుల పాఠశాలను దత్తత తీసుకుని అక్కడి విద్యార్థులకు కావాల్సిన చదువు వసతి తదితర సౌకర్యాలు కల్పిస్తూ తన గొప్ప మనసు చాటుకుంటుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మంచు లక్ష్మి. సర్కారు స్కూళ్లలో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసింది. టీచ్ ఫర్ ఛేంజ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని 500 ప్రభుత్వ స్కూళ్లలో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని 20 ప్రభుత్వ స్కూళ్లలో స్మార్ట్ క్లాస్ రూమ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది మంచు లక్ష్మి. కోతిరాంపూర్‌ (పోచంపల్లి) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన క్లాస్‌ రూంను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొని.. మంచు లక్ష్మిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లలా మారుస్తాను.. విదేశాల్లో స్థిర పడిన ఎన్నారైలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వార్త విన్న ఆమె అభిమానులు, నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.


Advertisement

Next Story

Most Viewed