- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచు లక్ష్మి కాళ్లపై పడిన అభిమాని (వీడియో).. లక్ష ఇవ్వడం వల్లనా లేక సినిమాలు చేయకని అలా చేశాడా?
దిశ, సినిమా: టాలీవుడ్ నటి మంచు లక్ష్మి అందరికీ సుపరిచితమే. ఆమె స్టార్ హీరో మోహన్ బాబు కూతురిగా పరిచయం అయినప్పటికీ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం అడపా దడపా సినిమాల్లో నటిస్తోంది. కానీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించినవి పంచుకుటోంది. డ్రెస్సింగ్, యాస వల్ల నిత్యం సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ఇటీవల అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్థాపన జరుగుతుండగా మంచు లక్ష్మి ల్యాప్ టాప్‌కు పూజలు చేసి నెట్టింట దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంది. ఇదిలా ఉంటే.. మంచు లక్ష్మి చాలా రోజుల తర్వాత ‘ఆదిపర్వం’ మూవీతో తొందరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజాగా, ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగ్గా.. ఈ వేడుకకు ఆమె హాజరైంది. అయితే ఓ అభిమాని డైరెక్ట్‌గా వెళ్లి స్టేజీపైకి వచ్చే మంచు లక్ష్మి కాళ్లపై పడిపోయాడు. అంతేకాకుండా కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. దీంతో ఆమె దూరం దూరం జరిగింది. ఆ తర్వాత బాడీగార్డ్ వచ్చి అతడిని కిందకు తీసుకెళ్లాక మంచు లక్ష్మి వెళ్లి మరీ సెల్ఫీ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన నెటిజన్లు లచ్చక్క లక్ష ఇవ్వడం వల్ల అలా చేశాడా? లేక ఇక నుంచి సినిమాలు చేయకని అలా చేశాడా? అని కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం అదంతా స్క్రిప్టెడ్‌గా లేక ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేసిందా అని చర్చించుకుంటున్నారు.
Read More..
అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు పెద్ద లాయర్.. ఆమె ఎవరంటే..?
- Tags
- Manchu Lakshmi