Malvika Mohanan: దర్శకుడు అలా చేస్తాడనుకోలేదు.. చివరికి ఒప్పుకున్నా..

by Javid Pasha |
Malvika Mohanan: దర్శకుడు అలా చేస్తాడనుకోలేదు.. చివరికి ఒప్పుకున్నా..
X

దిశ, సినిమా : గ్లామర్ ఫీల్డ్ అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం కానీ.. నటీ నటుల తెరవెనుక కష్టాలు చాలా మందికి తెలియదని సినీ విశ్లేషకులు చెప్తుంటారు. షూటింగ్‌లు మొదలు కొని థియేటర్‌లో రిలీజ్ వరకు వివిధ క్యారెక్టర్ ఆర్టిస్టులతోపాటు హీరో హీరోయిన్లు కూడా పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది. హీరోయిన్లయితే మరిన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్తుంటారు. సన్నివేశాల చిత్రీకరణ వరకు వస్తే అప్పుడప్పుడూ డైరెక్టర్లు ఇచ్చే ట్విస్టులతో హీరోయిన్లు ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంటారు. అలాంటి ఓ అనుభమే తనకు ఎదురైంది అంటోంది నటి మాళవిక మోహనన్. ఇంతకీ ఏం జరిగిందంటే..

ప్రస్తుతం ఓ వైవిధ్య భరితమైన స్టోరీతో ‘తంగలాన్’ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉందన్న విషయం తెలిసిందే. ఇందులో కోలీవుడ్ హీరో విక్రమ్‌ సహా నటీనటులందరూ డీ గ్లామరైజ్‌గా కనిపించనున్నారు. ఇకపోతే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ అలా చేస్తాడని ముందే ఊహించలేకపోయా. సరిగ్గా షూటింగ్ స్పాట్‌లో అసలు విషయం చెప్పేసరికి భయం వేసింది. చివరికి ఒప్పుకోక తప్పలేదు’ అని మూవీలోని ఓ సన్నివేశ చిత్రీకరణ గురించి చెప్పుకొచ్చింది.

‘‘ఒక రోజు సెట్‌కు వెళ్లేసరికి అక్కడికి ఒక గేదెను తీసుకొచ్చారు. షూటింగ్ స్టార్ట్ అవుతుండగా దర్శకుడు దానిపై ఎక్కగలవా? అని అడిగారు. ఏదో సరదాగా అన్నారనుకున్నాను. నిజంగా అది సన్నివేశ చిత్రీకరణలో భాగమని తెలిసేసరికి ఒక్కసారిగా భయం వేసింది. కానీ చివరికి తప్పలేదు. భయంతోనే గేదెపై ఎక్కాను’’ అంటూ తంగలాన్ మూవీ షూటింగ్ విశేషాలను పంచుకుంది మాళవిక మోహనన్. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు క్యూరియాసిటీతో రెస్పాండ్ అవుతున్నారు.

Advertisement

Next Story