Mohanlal: ఆసుపత్రిలో చేరిన మలయాళ స్టార్ హీరో.. ఆందోళనలో ఫ్యాన్స్

by Prasanna |   ( Updated:2024-08-18 12:52:51.0  )
Mohanlal: ఆసుపత్రిలో చేరిన మలయాళ స్టార్ హీరో.. ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా : మలయాళీ హీరో మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఉదయం నుంచి ఈ హీరోకి సంబందించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. అసలేం జరిగిందో ఇక్కడ చూద్దాం..

జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటంతో కొచ్చిలోని అమృత హాస్పిటల్లో చేర్చారు. ఈ విషయాన్ని ఆసుపత్రి డాక్టర్స్ వెల్లడించారు. ప్రస్తుతం బాగానే ఉంది కానీ పూర్తిగా కోలుకోవడానికి ఐదు రోజులు పడుతుందని అక్కడి వైద్యులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్లేసుల్లో షూటింగ్ చేయొద్దని మెడికల్ బులెటిన్ చెబుతోంది. ప్రస్తుతం, ఆయన హెల్త్ మెరుగ్గా ఉందని, మోహన్ లాల్ త్వరలోనే కోలుకుంటున్నారని హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు.

మోహన్‌లాల్ హాస్పిటల్లో చేరారన్న వార్త తెలియగానే ఫ్యాన్స్ ఆందోళన చెందారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రేయర్స్ చేస్తున్నారు. ఇంకో వైపు మోహన్‌లాల్‌ హాస్పిటల్లో చేరడంపై పలు సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. మోహన్ లాల్ ఎంపురాన్ సినిమాలో నటిస్తున్నారు. ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని అధికారికంగా ప్రకటించారు.

Advertisement

Next Story