ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి అపర్ణా నాయర్ ఆత్మహత్య

by Satheesh |   ( Updated:2023-09-01 08:09:47.0  )
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి అపర్ణా నాయర్ ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి అపర్ణా నాయర్ ఇవాళ మృతి చెందింది. అపర్ణా నాయర్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అపర్ణా నాయర్ మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే అపర్ణా నాయర్ సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అపర్ణా నాయర్ మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక, అపర్ణా నాయర్ పలు సీరియల్స్, చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

Next Story