ముద్దు, ఇంటిమేట్ సీన్స్ చేయడంపై మాళవికా మోహనన్ ఆసక్తికర కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-09-14 14:18:38.0  )
ముద్దు, ఇంటిమేట్ సీన్స్ చేయడంపై మాళవికా మోహనన్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ స్టార్ హీరోల సరసన వరుస సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. ఇటీవల ఈ అమ్మడు కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్‌తో కలిసి చేసిన ‘తంగలాన్’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రజెంట్ మాళవికా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘రాజాసాబ్’ మూవీ చేస్తోంది. అలాగే ‘యుధ్రా’ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. అయితే ఇందులో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటించగా.. రవి ఉద్యావర్ తెరకెక్కించాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న మాళవిక ఇంటిమేట్ సీన్స్‌ చేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘శృంగార సీన్స్ చేస్తున్నప్పుడు ఏ సెట్‌లోనైనా కో-ఆర్డినేటర్‌ను నియమిస్తున్నారు. అది చాలా మంచి నిర్ణయం. నటీనటులు ఇబ్బంది పడకుండా ఆ సీన్స్ ఎలా చేయాలో చెప్తున్నారు. కానీ మా సెట్‌లో మాత్రం అలాంటి వారు ఎవరూ లేరు. యుధ్రాలోని ‘సాథియా’ పాట గురించి మాకు డైరెక్టర్ చెప్పినప్పుడు నేను, సిద్ధాంత్ కంగారుపడ్డాం.

మేము అసలు చేయగలమా అనే సందేహం కూడా వచ్చింది. ఆ తర్వాత సముద్ర తీరం, అందులోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేక ఏదో ఒకరకంగా పూర్తి చేయాలని అనుకున్నాము. కానీ డైరెక్టర్ చెప్పిన విధంగానే చేశాము. అయితే ఇంటిమేట్, లేదా ముద్దు సీన్స్ చేయడం అంత సులభం కాదు. నటీనటుల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండాలి. అలాగే సౌకర్యవంతమైన వాతావరణం ఉంటేనే చేయగలం’’ అని చెప్పుకొచ్చింది

Advertisement

Next Story