మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. గుంటూరుకారం రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ!

by Anjali |   ( Updated:2023-10-02 06:58:04.0  )
మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. గుంటూరుకారం రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో తరచూ మార్పులు జరగడంతో మహేష్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మొదట వచ్చే ఏడాది జనవరి 13న రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఆ తర్వాత ఈ మూవీని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తారీకున విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. విడుదల తేదీని ప్రకటించిన తర్వాత మూవీ షూటింగ్ అనుకున్నంత స్పీడ్‌గా జరగడం లేదని.. షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి చాలా టైమ్ పడుతుందని, అలాగే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా ఎక్కువగానే సమయం పట్టే ఛాన్స్ ఉండడంతో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే అవకాశం అస్సలు కనిపించట్లేదని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.

అయితే తాజాగా ఈ వార్తలపై ఈ మూవీ మేకర్స్ స్పందించి.. ‘‘ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ చాలా స్పీడ్‌గా జరుగుతోంది. సినిమాకు సంబంధించిన పనులన్నీ కూడా మేము అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమాను వచ్చే ఏడాది (2024) కచ్చితంగా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని’’ గుంటూరు కారం చిత్ర మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎగిరి గంతులేస్తున్నారు.

Advertisement

Next Story