సినిమాలు చేసుకుంటున్నావు చేసుకో.. రాజకీయాల్లోకి వస్తే నరికేస్తా.. ప్రభాస్‌కు ప్రధాన ప్రతిపక్షనేత వార్నింగ్..!!

by sudharani |
సినిమాలు చేసుకుంటున్నావు చేసుకో.. రాజకీయాల్లోకి వస్తే నరికేస్తా.. ప్రభాస్‌కు ప్రధాన ప్రతిపక్షనేత వార్నింగ్..!!
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రసత్తుం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘ఆదిపురుష్’ పరాజయం అయినా ‘సలార్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం సలార్ షూటింగ్‌లో ఉన్న ప్రభాస్‌పై ఓ న్యూస్ నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది. ఏ గొడవలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడిపే ప్రభాస్‌కు ఓ రాజకీయ నాయకుడు తల నరికేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడంటా. అయితే ఆ రాజకీయ నాయకుడు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు అనే విషయాల్లోకి వెళితే..

టాలీవుడ్ సీనియర్ నటుడు, దివంగత కృష్ణంరాజు వారసత్వంగా ప్రభాస్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కృష్ణంరాజు రాజకీయాల్లో కూడా తనదైన శైలీలో రాణించారు. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో కృష్ణంరాజు తరపున ప్రభాస్ పోటీకి దిగబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో ఓ ప్రధాన ప్రతిపక్షనేత ప్రభాస్‌కు ఫోన్ చేసి సినిమాలు చేసుకుంటున్నావు చేసుకో.. రాజకీయాలు నీకెందుకు..? రాజకీయాలలోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా.. తల నరికేస్తాం.. అంటూ వార్నింగ్ ఇచ్చాడట. దీంతో ప్రభాస్ కూడా నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. మీకు భయపడి నేను ఇలా చెప్పడం లేదు. నిజంగానే నాకు పాలిటిక్స్ అంటే పెద్దగా ఆసక్తి లేదంటూ చెప్పుకొచ్చారట. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది. మరి దీనిపై ప్రభాస్ టీమ్, ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి

Advertisement

Next Story

Most Viewed