ఐదు భాషల్లో Mahesh-Trivikram మూవీ.. కొట్టిపారేసిన సూపర్‌స్టార్?

by Hajipasha |   ( Updated:2022-08-23 15:20:11.0  )
ఐదు భాషల్లో Mahesh-Trivikram మూవీ.. కొట్టిపారేసిన సూపర్‌స్టార్?
X

దిశ, సినిమా : ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ నుంచి ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే బీటౌన్‌లో ఆందోళన వాతావరణం ఏర్పడుతోంది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప' సినిమాలతో పాటు రీసెంట్‌గా విడుదలైన 'కార్తికేయ 2' బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడమే ఇందుకు నిదర్శనం. ఇక అసలు విషయానికొస్తే.. ఇప్పటికే ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్‌గా పేరు సంపాదించుకోగా ఈ విషయంలో మహేష్ బాబు మాత్రం వెనుకంజలో ఉన్నారు . తన చివరి చిత్రం 'సర్కారు వారి పాట' ద్వారా నార్త్‌లోకి ఎంట్రీ ఇస్తాడనుకున్న ఫ్యాన్స్‌ను నిరాశ పరిచాడు. ఈ క్రమంలో త్రివిక్రమ్‌తో చేయబోతున్న #SSMB28 ప్రాజెక్ట్‌ను ఏకంగా ఐదు భాషల్లో రిలీజ్ చేస్తారంటు వార్తలొచ్చాయి. కానీ వాటన్నింటికీ మహేష్ చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో కేవలం తెలుగులోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని, హిందీలో కూడా విడుదలవదనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు స్వయంగా మహేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నాడనే న్యూస్ హల్ చల్ చేస్తోంది.

RRR సినిమా చూస్తుంటే.. రామ్ గోపాల్ వర్మ.. షాకింగ్ కామెంట్..

Advertisement

Next Story