- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పవన్ కల్యాణ్ రాజకీయాలపై.. మహేష్ బాబు సోదరి ఆసక్తికర కామెంట్స్
దిశ, సినిమా: సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు సోదరి మంజుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె పలు చిత్రాల్లో నటించింది. కానీ ఇప్పుడు సినిమాలకు దూరమై.. యూట్యూబ్ వీడియోలు చేస్తుంది. అయితే మంజుల ఒకానొక సమయంలో పవన్ కల్యాణ్‌పై చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంజుల.. ‘‘ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ప్రజాసేవ చేయాలనుకునే ఆలోచన మనసు నుంచి వచ్చింది కాబట్టి వెళ్లారు. ఇలాంటి లీడర్లు చాలా అవసరం. అది స్వార్థం నుంచి పుట్టింది కాదు.
నాకు పవన్‌తో ఎలాంటి వ్యక్తిగత పరిచయం లేకపోయినా నేను చూస్తుంన్నంత వరకు ఆయనకు రాజకీయాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ మనసు నుండి వచ్చిందని అనిపిస్తోంది. మనసు చెప్పింది వినే వాళ్లంటే నాకు చాలా ఇష్టం. అందులో పవన్ కల్యాణ్ ముందు ఉంటాడు. అయితే ఆయన టాలీవుడ్ హీరో కాబట్టి సినిమాలు చేసుకుంటూ ఎంజాయ్ చేయవచ్చు. కానీ రాజకీయాల్లో ఉంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని ముందుకెళ్తున్నారు. అలాగే గెలుపు వైపు అడుగులు వేయాలని కోరుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.