- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏడో దశ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహాలం నెలకొంది. ఏడు దశల్లో భాగంగా ఇప్పటికే మూడు ఫేజ్‌ల పోలింగ్ కంప్లీట్ కాగా.. మరో నాలుగు దశల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఏడో దశ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్‌ను బుధవారం ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. చివరిదైనా ఏడో దశలో దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇవాళ్టి (బుధవారం) నుండి ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఇవ్వగా.. 15న నామినేషన్లను స్క్రూటీని చేయనున్నారు.
ఈ నెల 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. జూన్ 1న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లోని ఒక స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్ 9, ఉత్తరప్రదేశ్ 13, పంజాబ్ 13 , బీహార్ 8, ఒడిశా 6, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్‌లో 3 స్థానాలకు లాస్ట్ ఫేజ్‌లో పోలింగ్ జరగనుంది. ప్రధాని మోడీ పోటీ చేస్తోన్న వారణాసి లోక్ సభ స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరగనుంది.