Mahesh Babu: SSMB 28 టైటిల్ రివీల్ టైం ఎప్పుడంటే?

by Prasanna |   ( Updated:2023-02-24 03:21:51.0  )
Mahesh Babu: SSMB 28 టైటిల్ రివీల్ టైం ఎప్పుడంటే?
X

దిశ,వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ లేటెస్ట్ సినిమా SSMB 28 వర్కింగ్ టైటిల్ తో మొదలైందని మనకి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం మయ్యింది. వీరిద్దరి కాంబో కోసం అభిమానులు కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. అయితేఎట్టకేలకు కాలానికి వీరిద్దరి కాంబో ఒకే అయ్యింది. మహేష్ ఈ సినిమా తరువాత రాజామౌళితో సినిమా చెయ్యనున్నారు. దీని కోసం మహేష్ ఇంకొంచం స్పీడ్ పెంచినట్టు తెలుస్తుంది.

SSMB 28 ఒక షెడ్యూల్ కంప్లిట్ అయ్యింది.. రెండో షెడ్యూల్ కు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను ఆగష్టులో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నారట.. అంతే కాకుండా త్వరలోనే సినిమా టైటిల్ ను రివీల్ చేయబోతున్నారట. ఉగాది పండుగ కానుకగా టైటిల్ ను ప్రకటించనున్నారని తెలుస్తుంది. మార్చి 22 న టైటిల్ లేదా ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారట. ఇదే నిజమైతే మహేష్ అభిమానులకు పెద్ద పండగే అని చెప్పుకోవాలి. ఇలాంటి వార్తలు గతంలో కూడా చాలానే వచ్చాయి. మరి ఈ ఉగాదికి టైటిల్ వస్తుందా ? లేదన్నది వేచి చూడాలి.

Also Read...

5 వేల వీధి కుక్కలను ఆమె ఇంట్లో వదలి తాళం వేయండి: Ram Gopal Varma

Advertisement

Next Story