Mahesh Babu అల్ట్రా స్టైలిష్ లుక్

by GSrikanth |   ( Updated:2022-10-13 13:23:02.0  )
Mahesh Babu అల్ట్రా స్టైలిష్ లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ త్రిమిక్రమ్‌తో కలిసి సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. SSMB28 వర్కింగ్‌ టైటిల్‌తో ప్రస్తుతం సెట్స్‌మీద ఉన్నది. అయితే, ఆయన సినిమాలో ఏ గెటప్‌లో కనిపించినా కనురెప్పలు వాల్చకుండా చూసే అభిమానులు చాలామందే ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఇప్పటికీ డ్రీం బాయ్ ఎవరు అంటే మహేష్ బాబు తరహాలో ఉండాలి అని అనుకుంటారు. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా పాతికేళ్ళ కుర్రాడి తరహాలోనే దర్శనమిస్తూ ఉన్నాడు. ఇక తాజాగా.. మరో అల్ట్రా స్టైలిష్ లుక్‌తో షాకిచ్చాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మహేష్ ఒక స్టైలిష్ హెయిర్ స్టైల్‌తో కనిపించడంతో నెటిజన్లు కూడా అదే తరహాలో పాజిటివ్‌గా కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మరాయి. కాగా, ఇటీవల సర్కారువారి పాట సినిమాతో మహేశ్ బాబు హిట్ కొట్టిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చ‌ద‌వండి

1. హైదరాబాద్‌లో తాలిబన్ల పాలన.. RGV సెన్సేషనల్ ట్వీట్

2. 'గరికపాటి చూపంతా ఆ హీరోయిన్ మీదే ఉందట'



Advertisement

Next Story