Sitara Ghattamaneni : మహేశ్ బాబుకు కూతురు సితారా స్పెషల్ విషెస్..!

by Anjali |   ( Updated:2023-08-09 06:20:18.0  )
Sitara Ghattamaneni  : మహేశ్ బాబుకు కూతురు సితారా స్పెషల్ విషెస్..!
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా తన గారాల పట్టి సితార ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెషల్ పోస్ట్ పెట్టింది. ఓ రెస్టారెంట్‌లో డైనింగ్ టేబుల్ వద్ద సితార, మహేష్ బాబు కూర్చుని తెగ నవ్వుకుంటున్న ఫొటోను పోస్టు చేసింది. కారణం ఏంటో తెలియదు కానీ ప్రిన్స్ చేతిలో వాటర్ గ్లాస్ పట్టుకుని.. సితార ఫేస్‌కు చేయి అడ్డు పెట్టుకుని క్యూట్ నవ్వుతున్న ఫొటో పెట్టింది. ‘‘జీవితంలో మనం కలిసి పంచుకునే గొప్ప క్షణాలివి. హ్యాపీ బర్త్ డే నాన్న. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.’’ అంటూ ఘట్టమనేని ప్రిన్సెస్ రాసుకొచ్చింది. ప్రస్తుతం సితార ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేగాక, మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు శుభకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న గుంటూరు కారం చిత్రం నుంచి కూడా అప్‌డేట్ వచ్చేసింది.

Read More: నేడు సూపర్ స్టార్ Mahesh Babu పుట్టిన రోజు

Advertisement

Next Story