మహేష్ బాబు - రాజమౌళి సినిమా మల్టీస్టారరా ..!

by Kavitha |   ( Updated:2024-03-04 10:05:31.0  )
మహేష్ బాబు - రాజమౌళి సినిమా మల్టీస్టారరా ..!
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారట. ఆ లుక్ రివీల్ కాకుండా ఉండేలా బయట ఫంక్షన్స్‌కు, ఈవెంట్స్ హాజరు కాకూడదని కండీషన్ కూడా పెట్టారట జక్కన్న. అలాగే మహేష్ కు జోడీగా ఓ ఇండోనేషియన్ బ్యూటీని రంగంలోకి దింపనున్నారట జక్కన్న. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా గురించిన ఓ క్రేజీ అప్డేట్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది.

ఏంటంటే ఈ మూవీలో మహేష్ బాబు మాత్రమే కాకుండా మరో హీరో కూడా నటించబోతున్నాడట. అది కూడా మన ఇండియన్ హీరో కాదు హాలీవుడ్ హీరో అని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్‌ని ఉగాది పండుగ రోజు అనౌన్స్ చేయనున్నారట. మాములుగా కాదు ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి మరి గ్రాండ్ గా అనౌన్స్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. మొత్తనికి మహేష్ తో సినిమా‌ని పాన్ వరల్డ్ గా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న.

Read More..

‘గామి’ ప్రమోషన్స్.. దేవుళ్లను దర్శించుకుంటున్న విశ్వక్ సేన్ (ట్వీట్)

Advertisement

Next Story