Pawan Kalyan-Mahesh Babu MultiStarrer Movie.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

by sudharani |   ( Updated:2023-09-27 15:35:13.0  )
Pawan Kalyan-Mahesh Babu MultiStarrer Movie.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
X

దిశ, సినిమా: మిగతా భాషలతో పోల్చుకుంటే టాలీవుడ్‌లో మల్టీస్టారర్ మూవీస్ చాలా తక్కువ. దర్శకుడు రాజమౌళి క్రియేటివ్ కారణంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సాకారమైంది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటించేందుకు ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరి హీరోల ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చారు. పెద్ద హీరోల కాంబోలో మూవీ వస్తే చూడాలని ఆశించే అభిమానులు ఇంకా చాలానే ఉంటారు. ఇకపోతే పవన్-మహేష్ బాబులకు ఉన్న ఫ్యాన్ బేస్ మరే హీరోకు లేదు. అలాంటిది ఆ ఇద్దరు హీరోలు కలిసి ఒకే మూవీలో నటిస్తే ఎలా ఉంటుంది. వింటుంటేనే వైబ్రేషన్స్ వస్తున్నాయి కదా. నిజానికి ఈ ఇద్దరి కాంబోలో మూవీ ఇప్పటికి రావాల్సిందే కానీ మిస్ అయిందట. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ అందరూ చూసే ఉంటారు. ఇందులో వెంకటేష్ పెద్దోడిగా, మహేష్ చిన్నోడిగా కనిపించారు. అయితే ఈ పెద్దోడి పాత్రకు ముందు పవన్‌ను అనుకున్నాడట దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. కానీ అప్పుడు పవన్ వేరే చిత్రాలతో బిజీగా ఉండటంతో కుదర్లేదట. అయితే మరో కథతో వీరిద్దరి కాంబో ట్రై చేయమని ఫ్యాన్స్ కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి : ఏ హీరోలకు ఎలాంటి కబుర్లు చెప్తే ఈ స్టార్ డైరెక్టర్‌కు డేట్స్ ఇస్తారో తెలుసా?

Advertisement

Next Story