- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ సినిమాలో విలన్ పాత్రలో Mahesh Babu డైరెక్టర్.. కారణం ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న తాజా చిత్రం ‘పెదకాపు’. నాగబాబు, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, రావు రమేశ్, ఈశ్వరీ, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీని శ్రీకాంత్ అడ్డాల రెండు భాగాలుగా రూపొందించబోతున్నారు. పార్ట్-1 నుంచి విడుదైన ట్రైలర్ రా అండ్ రాస్టిక్‌గా ఉంది. పాలిటిక్స్, కమ్యూనిటీ గొడవలు చుట్టూ కథ మొత్తం తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే ప్రేక్షకులకు అసలైన ట్విస్ట్ ఏంటంటే? ఇందులో డైరెక్టరే విలన్‌గా కనిపించడం. ఈ చిత్రంలో శ్రీకాంత్ విలన్‌గా కనిపించడానికి గల కారణం ఏంటని తాజాగా దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
‘‘నేను ఆ పాత్ర కోసం ఫస్ట్ మలయాళ నటుడు శౌబిన్ షహిర్‌ను ఎంపిక చేశాను. ఆయన కూడా ఆ పాత్రలో నటించేందుకు ఓకే చెప్పారు. తీరా షూటింగ్ స్పాట్‌కు వచ్చి చూస్తే ఏమైందో తెలియదు కానీ అతడు షూట్‌కు రాలేదు. అప్పటికప్పుడు మరొకరిని తీసుకొచ్చి సెట్ చేయడం చాలా కష్టం. మరోవైపు చాలా మంది ఆర్టిస్టులతో పాటు అన్నీ ఏర్పాట్లు చేశారు. అప్పుడు నా అసోసియేట్ కిషోర్ ఆ పాత్ర నువ్వు చేయ్యచ్చు కదా? అని నన్ను బలవంతంగా ఒప్పించాడు.’’ అంటూ దర్శకుడు వెల్లడించాడు. కాగా, మహేశ్ బాబుతో శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.
ఇవి కూడా చదవండి : Mahesh Babu కు నేను బాకీ పడ్డాను.. త్వరలోనే తీర్చేస్తా: S.J.Surya