Mahesh Babu: గుబురు గడ్డం, పోనీ టెయిల్‌తో దర్శనమిచ్చిన మహేశ్ బాబు.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే?

by sudharani |
Mahesh Babu: గుబురు గడ్డం, పోనీ టెయిల్‌తో దర్శనమిచ్చిన మహేశ్ బాబు.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే?
X

దిశ, సినిమా: ఈ ఏడాది ‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తన తదుపరి చిత్రం రాజమౌళి డైరెక్షన్‌లో చేయబోతున్న విషయం తెలిసిందే. 'SSMB 29' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుబోతున్న ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్‌లో అత్యంత భారీగా ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారట. అంతే కాకుండా.. ఈ సినిమా కోసం మహేశ్ తన లుక్ కూడా మార్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మహేశ్ బాబు కొత్త లుక్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచాడు.

బర్త్‌డే సందర్భంగా మహేశ్ బాబు తన ఫ్యామిలీతో ఇటీవల జైపుర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. పుట్టినరోజు సెలబ్రేషన్స్ అనంతరం తాజాగా హైదరాబాద్‌కు తిరిరి పయనమయ్యారు. ఈ క్రమంలోనే జైపుర్ ఎయిర్‌పోర్టులో కుటుంబంతో కలిసి దర్శనమిచ్చాడు మహేశ్. ఇందులో ప్రిన్స్ గుబురు గడ్డంతో, పోనీ టెయిల్‌తో కనిపించాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. మహేశ్ బాబు లుక్ చూసి ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు. సూపర్, క్యూట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed