Guntur Karam : ‘గుంటూరు కారం’ షూటింగ్ బరిలోకి దిగిన మహేష్ బాబు

by samatah |   ( Updated:2023-06-24 11:54:08.0  )
Guntur Karam : ‘గుంటూరు కారం’ షూటింగ్ బరిలోకి దిగిన మహేష్ బాబు
X

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘గుంటూరు కారం’. ఈ మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుంచి అటంకాలు వచ్చి పడుతూనే ఉన్నాయి. సినిమా నుంచి ఒకరి తర్వాత ఒకరు తప్పుకుంటున్నారు. దీంతో అసలు మూవీ ముందుకెళ్తుందా? లేదా ఆపేశారా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే తాజాగా ఈ రోజు (జూన్ 24) నుంచి సాలిడ్ యాక్షన్ షెడ్యూల్‌తో మహేష్ బాబు మళ్లీ బరిలోకి దిగారని కన్ఫర్మ్ చేసింది మూవీ టీం. దీంతో సినిమా ఆగిపోతుందన్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.

Also Read: ఆ సీనియర్ నటి కాళ్లు పట్టుకున్న జూ.ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

Advertisement

Next Story