Mahesh Babu: ముఫాసా కోసం మహేష్ బాబు.. తెలుగు ఆడియన్స్‌కు ఇక పండుగే!

by sudharani |
Mahesh Babu: ముఫాసా కోసం మహేష్ బాబు.. తెలుగు ఆడియన్స్‌కు ఇక పండుగే!
X

దిశ, సినిమా: బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్న అల్టిమేట్ జింగిల్ కింగ్ 'ముఫాసా: ది లయన్ కింగ్' లెగసిని గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి సమయం ఆసన్నమైంది. 2019లో లైవ్-యాక్షన్ ది లయన్ కింగ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ, విజువల్‌గా అద్భుతమైన లైవ్ యాక్షన్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ 20 డిసెంబర్ 2024న డిస్నీ ప్లెస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ముఫాసా కోసం మహేశ్ బాబు రంగంలోకి దిగాడు. ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రానికి సంబంధించిన టైటిల్ రోల్‌కు మహేశ్ బాబు ఇక ఇప్పటికే వాయిస్ ఓవర్ పూర్తి కాగా.. ఆగస్టు 26న ఉదయం 11.07 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు మూవీ యూనిట్.

ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మాట్లాడుతూ.. ‘డిస్నీ బ్లాక్‌బస్టర్ లెగసీ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, టైమ్‌లెస్ స్టోరీ టెల్లింగ్‌ నాకెంతో ఇష్టం. ‘ముఫాసా’ పాత్ర తన కొడుకును నడిపించే ప్రేమగల తండ్రిగా మాత్రమే కాకుండా అడవికి రారాజు. డిస్నీతో ఈ అసోసియేషన్ వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది, ఇది నా పిల్లలతో నేను ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే మూమెంట్. డిసెంబర్ 20న తెలుగులో బిగ్ స్క్రీన్‌పై ముఫాసా: ది లయన్‌ కింగ్‌ను నా కుటుంబంతో పాటు నా అభిమానులు చూస్తారని ఎదురు చూస్తున్నాను' అన్నారు. కాగా.. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 20న హిందీతో పాటు ఇంగ్లిష్, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.

Advertisement

Next Story

Most Viewed