మైండ్ బ్లోయింగ్ గెటప్‌లో ఫారెన్ నుంచి దిగిన మహేష్ బాబు.. హాలీవుడ్ హీరోలు కూడా పనికి రారుగా!

by Kavitha |
మైండ్ బ్లోయింగ్ గెటప్‌లో ఫారెన్ నుంచి దిగిన మహేష్ బాబు.. హాలీవుడ్ హీరోలు కూడా పనికి రారుగా!
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘SSMB29’లో నటిస్తున్నాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీకి కథ సమకూర్చారు. స్క్రిప్ట్ కూడా ఫైనల్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైనట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలో ఎస్ఎస్ఎంబి 29 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. రెండేళ్లకు పైగా సమయాన్ని మహేష్ బాబు ఈ మూవీకి కేటాయిస్తున్నారు. ఎందుకంటే రాజమౌళి ఒక పట్టాన సినిమా పూర్తి చేయడు అనే విషయం తెలిసిందే. అనుకున్న టైం కంటే మినిమమ్ ఏడాది పైగా సమయం తీసుకుంటారు. ఎస్ఎస్ఎంబి 29 విడుదలయ్యేది కూడా మూడేళ్ళ తర్వాతే అనే వార్త వినిపిస్తోంది. కాగా ఈ మూవీ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు రెడీ అవుతున్నారు.

అయితే గతంలో ఎప్పుడూ కూడా బాగా పెరిగిన గడ్డం లుక్‌లో మహేష్ బాబు కనిపించలేదు. ఆయన ఎప్పుడు తన మీసం కూడా చాలా లైట్‌గా ఉండేలా చూసుకుంటాడు. అయితే రాజమౌళి ప్రతి హీరోని కూడా డిఫరెంట్‌గా చూపిస్తారు. తన హీరోని గతంలో ఎన్నడూ ట్రై చేయని లుక్‌లో ప్రజెంట్ చేస్తాడు. సూపర్ స్టార్ మహేష్‌ని కూడా ఆయన ఫ్యాన్స్ సర్ప్రైజ్ అయ్యేలా సిద్ధం చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దానిలో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు జుట్టు ఇంకా గడ్డం పెంచుతున్నారు.తాజాగా సూపర్ స్టార్ మహేష్ లుక్ లీక్ అయ్యింది. ఫ్యామిలీతో పాటు బయటకు వెళ్లిన మహేష్ బాబు తిరిగి హైదరాబాద్‌కి వచ్చాడు. అయితే ఎయిర్పోర్ట్‌లో మీడియా ప్రతినిధులు ఆయన్ని తమ కెమెరాలలో బంధించారు. మహేష్ బాబు లుక్ కిరాక్ తెప్పించింది. హాలీవుడ్ హీరోలను తలదన్నేలా సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారు. అది చూసిన నెటిజన్లు వావ్ మైండ్ బ్లోయింగ్ అంటూ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed