Madonna: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. అది ఎక్కువై ఆస్పత్రిలో చేరిన సింగర్

by Anjali |   ( Updated:2023-06-29 07:39:14.0  )
Madonna:  ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. అది ఎక్కువై ఆస్పత్రిలో చేరిన సింగర్
X

దిశ, సినిమా: స్టార్ సింగర్ మడోన్నా అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది ఆమె టీమ్. త్వరలోనే ప్రపంచ పర్యటన చేయబోతున్నట్లు ప్రకటించిన మడోన్నా.. తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. దీంతో వరల్డ్ టూర్ వాయిదా వేసుకున్నట్లు వెల్లడిస్తూ నెట్టింట పోస్ట్ పెట్టారు. ‘ఓ ఇన్ఫెక్షన్ కారణంగా గతవారం మడోన్నా హాస్పిటల్‌లో చేరింది. చాలారోజులుగా ICUలో గడపాల్సి వస్తోంది. ప్రస్తుతం తన ఆరోగ్యం కాస్త మెరుగుపడుతున్నప్పటికీ ఇంకా వైద్యుల సంరక్షణలో ఉంది. ఈ సమయంలో తన పర్యటనలో మార్పులు చేయబోతున్నాం. రీషెడ్యూల్ చేసిన తర్వాత కొత్త షోల పూర్తి వివరాలు తేదీలతో సహా మీతో పంచుకుంటాం’ అని స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న మడోన్నా ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించడంతో ఆసుపత్రికి తరలించినట్లు సన్నిహితులు తెలిపారు.

Read More: హీరో సుశాంత్ సింగ్ డెత్ కేసు : దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు

Click here for Instagram post


Advertisement

Next Story